- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్య రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం : నిమ్మల రామానాయుడు
కూటమి ప్రభుత్వ పాలనలో పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో వైద్య రంగానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలోని (Palakollu Government Hospital) ఆయుర్వేద ఆసుపత్రి అదనపు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై (Development Works) అధికారులతో కలిసి సమీక్షించారు. అనంతరం జిన్నూరులో ఆయుర్వేద ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సంపూర్ణ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచామన్నారు. ఆయుర్వేద, అల్లోపతి వైద్య సేవలు రెండింటికీ సమాన ప్రాముఖ్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
అదే విధంగా పాలకొల్లు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. పనుల్లో నాణ్యత, పారదర్శకతకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి మాటే లేదని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు కూడా విధ్వంసం చేశారని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయన్నారు. అభివృద్ధి పనులకు కొత్త ఊపిరి వచ్చిందన్నారు. పెండింగ్ పనులను కూడా పరుగులెత్తించడం జరుగుతోందని తెలియజేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ప్రకటించారు.






