Good News:‘బడి దూరమా.. దిగులొద్దు’.. ప్రభుత్వం కీలక నిర్ణయం

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-01 06:48:44  IST  )

రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త అందింది.

Good News:‘బడి దూరమా.. దిగులొద్దు’.. ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని విద్యార్థులకు శుభవార్త అందింది. ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ప్రయాణ భత్యాన్ని అందించనుంది. కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది.

ఇందుకోసం కేంద్రం రూ.47.91కోట్లు మంజూరు చేసింది. దీనికి ఏపీలో 79,860 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ క్రమంలో అర్హులైన విద్యార్థులకు.. వారి తల్లుల ఖాతాల్లో నెలకు రూ.600 చొప్పున 3 నెలలకోసారి రూ.1800 జమ అవుతాయి. ఈ నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి చదువుతున్న ప్రాథమిక పాఠశాలలు (1కి.మీ), ప్రాథమికోన్నత పాఠశాలలు(3.కి.మీ), సెకండరీ స్కూళ్లలో(5కిమీ) పాఠశాలల విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. స్కూల్ దూరంగా ఉండటంతో ప్రయాణ ఖర్చులతో మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story