- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking:రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో రీసెంట్‌గా కూటమి ప్రభుత్వం(AP Government) తల్లికి వందనం పథకం అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని జూన్ 20న అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. అయితే, రైతులు అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే E-KYC చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ-కేవైసీ కోసం రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ తరుణంలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ అర్హులు ఈ-కేవైసీ కోసం రైతు సేవా కేంద్రాల(RSK)కు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం(Government) స్పష్టం చేసింది. అర్హులైన 45.65లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ చేసినట్లు వెల్లడించారు. సరైన వివరాలు లేని 1.45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుంది. ఆ రైతుల వివరాలను రైతు సేవా కేంద్రాలకు పంపడం జరిగిందని తెలిపారు. అందులో పేర్లు ఉన్న రైతులు ఈ కేవైసీ చేయించుకుంటే సరిపోతుందని తెలిపింది. ఈ నెల(జూన్) 20వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. రైతులు తాము ఈ-కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశంపై మొబైల్‌లో అధికారిక వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/లోకి వెళితే తెలుసుకోవచ్చు. అలాగే ఈ వెబ్‌సైట్ లో అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. వెబ్సైట్‌లో సర్వీసు అందుబాటులోకి వచ్చాక స్టేటస్ బటన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుసుకోవచ్చు.






