AP News : పేదలకు సర్కార్ భారీ గుడ్ న్యూస్.. 3 లక్షల నూతన గృహాప్రవేహాలు

by Muthe.Rajitha |

పేదలకు మరో భారీ గుడ్ న్యూస్ తెలిపేందుకు ఏపీ సర్కార్(AP Govt) సిద్ధం అవుతోంది.

AP News : పేదలకు సర్కార్ భారీ గుడ్ న్యూస్.. 3 లక్షల నూతన గృహాప్రవేహాలు
X

దిశ, వెబ్ డెస్క్ : పేదలకు మరో భారీ గుడ్ న్యూస్ తెలిపేందుకు ఏపీ సర్కార్(AP Govt) సిద్ధం అవుతోంది. దాదాపు 3 లక్షల మంది పేదలకు నూతన గృహాలు అందజేసి.. వారందరితో ఒకేసారి గృహ ప్రవేశ కార్యక్రమం చేయించేందుకు భారీ ప్రణాళిక రచిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP)ల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో 3 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన లబ్దిదారులకు నూతన గృహాలు జూన్ 12న అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. గడువు లోపలే నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆదేశించారు. ఇప్పటి వరకు 3 లక్షల గృహాల్లో 1.70 లక్షలు పూర్తికాగా.. మరో 60,000 గృహాలు తుది దశలో ఉన్నాయి. కాగా వీటికోసం ప్రభుత్వం రూ.300 కోట్లు ఖర్చు చేయనుంది.

Next Story