AP:‘ప్ర‌భుత్వం అంటే మ‌ల్టీ స్టార‌ర్ మూవీ అనుకుంటున్నారు’.. మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Govt) పై వైసీపీ సీనియర్ నేత(YCP Senior Leader), మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP:‘ప్ర‌భుత్వం అంటే మ‌ల్టీ స్టార‌ర్ మూవీ అనుకుంటున్నారు’.. మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Govt) పై వైసీపీ సీనియర్ నేత(YCP Senior Leader), మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్‌గా జ‌న‌సేన నేత‌(Janasena Leader) కొణిదేల నాగ‌బాబు(Konidela Nagababu)ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోనుండడంపై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు(Former Minister Ambati Rambabu) ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్ర‌భుత్వం అంటే మ‌ల్టీ స్టార‌ర్ మూవీ(multi starrer movie) అనుకుంటున్నారు.. పాపం’ అని ట్వీట్ చేశారు. దీనికి సీఎం చంద్ర‌బాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌(Deputy Pawan Kayan), మంత్రి లోకేశ్‌(Minister lokesh), నాగ‌బాబును ట్యాగ్ చేశారు. దీంతో ఇప్పుడి ట్వీట్ సోష‌ల్ మీడియా(Social Media)లో వైర‌ల్ అవుతోంది. ఇక గ‌త కొన్నిరోజులుగా నాగ‌బాబు రాజ్య‌స‌భ‌కు వెళతారంటూ ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అనూహ్యంగా ఆయనకు రాష్ట్ర మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తున్న‌ట్లు సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డంతో ఒక్క‌సారిగా నాగబాబు పేరు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Next Story