ఏలూరులో ఉరివేసుకున్న టీచర్.. భర్తకు గాయాలు.. ఏం జరిగింది?

by Naga Rani Yarlagadda |

ఏలూరు నగర శివారు ప్రాంతమైన చోదిమెళ్లలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న మందాడ దేవిక (35) ఆదివారం తెల్లవారుజామున..

ఏలూరులో ఉరివేసుకున్న టీచర్.. భర్తకు గాయాలు.. ఏం జరిగింది?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు నగర శివారు ప్రాంతమైన చోదిమెళ్లలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న మందాడ దేవిక (35) ఆదివారం తెల్లవారుజామున ఆమె నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె భర్త కాళ్లు, చేతులకు బ్లేడ్ తో కట్ చేసిన గాయాలు ఉండగా.. రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారిని గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా.. భర్త సురేంద్ర కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగానే పనిచేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపాడు మండలం రాయగూడానికి చెందిన దేవికకు - సురేంద్రకు 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ ప్రభుత్వ టీచర్లే. హ్యాపీగా సాగాల్సిన వారి జీవితంలో ఏం జరిగిందో గానీ.. దేవిక ఉరి వేసుకుని అనుమానాస్పదస్థితిలో మరణించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో పిల్లలు ఎక్కడున్నారు? సురేంద్రకు గాయాలు ఎలా అయ్యాయి? ఇద్దరి మధ్య కలహాలేమైనా ఉన్నాయా ? లేక వృత్తి రీత్యా సమస్యలా ? అన్న విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story