- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల లడ్డు వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుమల లడ్డు తయారీలో నాణ్యత, ఇతర వివాదస్పద అంశాలపై వాస్తవాలను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డు తయారీ(Tirumala Laddu Preparation)లో నాణ్యత, ఇతర వివాదస్పద అంశాలపై వాస్తవాలను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరిపిన వన్ మెన్ కమిటీ(One-man committee) సమర్పించిన నివేదికను లోతుగా అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన హై లెవెల్ కమిటీ(High Level Committee)ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందించనుంది.
చర్యలపై ఫోకస్
ఈ అత్యున్నత స్థాయి కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా రాష్ట్ర డీజీపీ (DGP), న్యాయ శాఖ కార్యదర్శి (Law Secretary) ఉంటారు. వన్ మెన్ కమిటీ ఇచ్చిన నివేదికలోని సాంకేతిక, పరిపాలనాపరమైన, న్యాయపరమైన అంశాలను ఈ బృందం సమగ్రంగా సమీక్షించనుంది. నిబంధనల ఉల్లంఘన ఎక్కడ జరిగింది..?, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై వీరు దృష్టి సారించనున్నారు.
వారంలోగా తుది నివేదిక
ఈ హై లెవెల్ కమిటీ తన విచారణను వేగవంతం చేసి, వారంలోగా తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో పారదర్శకతను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా దోషులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.






