అథ్లెటిక్ క్రీడాకారిణి జ్యోతి యర్రాజీకి ప్రభుత్వ సహకారం

by Thanuru Gopichand |

అథ్లెటిక్స్ క్రీడాకారిణి జ్యోతి యర్రాజీకి (Jyothy Yarraji) చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అథ్లెటిక్ క్రీడాకారిణి జ్యోతి యర్రాజీకి ప్రభుత్వ సహకారం
X

దిశ, వెబ్ డెస్క్ : అథ్లెటిక్స్ క్రీడాకారిణి జ్యోతి యర్రాజీకి (Jyothy Yarraji) చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ (Asian Athletics Championship) పోటీల్లో విజయం సాధించి, బంగారు పతకం సొంతం చేసుకున్న ఆమె ఒంటరిగా నిలుచొని దేశానికి ప్రాతినిధ్యం వహించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వర్షం కారణంగా ప్రేక్షకులు లేకపోవడంతో మైదానంలో కేరింతలు, కరతాళ ధ్వనులు లేకపోవడం ఆ వీడియో చూసిన ప్రతిఒక్కరూ స్పందించేలా చేసింది. వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు జ్యోతిని అభినందనల వర్షంలో ముంచెత్తారు. అయితే మహిళల 100 మీటర్ల హార్డిల్స్ లో కేవలం 12.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి జ్యోతి సరికొత్త రికార్డును సృష్టించడం ఇక్కడ కొసమెరుపు.

ఈ విషయమై ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు స్పందిస్తూ.. అథ్లెటిక్ క్రీడాకారాణి జ్యోతి యర్రాజీకి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. క్రీడల్లో ఆమె రాణించడానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. జ్యోతి సాధించిన విజయాలు రాష్ట్రం, దేశానికి గర్వకారణంగా నిలుస్తాయన్నారు. ఒలింపిక్స్ లో పతకం సాధించే వరకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు.

Next Story