AIలో యువతకు ట్రైనింగ్.. ఆ సంస్థతో ప్రభుత్వం కీలక ఒప్పందం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-06 13:19:19  IST  )

రాష్ట్రం(Andhra Pradesh)లోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది.

AIలో యువతకు ట్రైనింగ్.. ఆ సంస్థతో ప్రభుత్వం కీలక ఒప్పందం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. యువతలో AI, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించి రాష్ట్రంలో ఐటీ ఆధారిత, ఇతర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతమైన సిబ్బందిని తయారు చేయడం కోసం ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే పలు కీలక సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు మరో సంస్థతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యువతకు నైపుణ్య శిక్షణ సహా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించేలా ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కంప్యూటింగ్ సంస్థ “ఎన్ విడియా(NVIDIA)”తో కీలక ఒప్పందం జరిగింది. ఈ మేరకు ఉన్నత విద్య అధికారులు, ప్రతినిధులు మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా 10వేల మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. దీంతో పాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్ ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు కానుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Next Story