అనుమానాస్పద స్థితిలో టీచర్‌ ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

ఏలూరు చొదిమెళ్ళలో ప్రభుత్వ పాఠశాల టీచర్‌ మందాడ దేవిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ...

అనుమానాస్పద స్థితిలో టీచర్‌ ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగరంలోని చొదిమెళ్ళలో ప్రభుత్వ పాఠశాల టీచర్‌ మందాడ దేవిక (35) ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్త సురేంద్ర ఆఘటన చేసి చేతులు కాళ్ళు బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే మందాడ దేవిక పుట్టినరోజు ఆదివారం. భర్త బైటకు వెళ్ళి వచ్చేసరికి ఆమె ఉరి వేసుకుని కనబడింది. దాన్ని తట్టుకోలేక సురేంద్ర తానూ బ్లేడ్‌తో చేతులు కాళ్ళు కోసుకుని ఆత్మహత్యా యత్నంచేశాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు స మాచారం ఇచ్చారు ఈ లోగా గాయపడిన సురేంద్రను ఆసుపత్రికి తరలించారు. సురేంద్రకు, పెదపాడు మండలలం రాయగూడెం గ్రామానికి చెందిన దేవికకు పదేళ్ళ క్రితం వివాహమయింది. . వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ ప్రభుత్వ టీచర్లే. సురేంద్ర ఇటీవలే పదోన్నతిపై హెడ్మాస్టర్‌ అయ్యారు. దేవిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్‌కు తరలించారు. గాయపడిన సురేంద్ర ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ ఉరి వేసుకుని కనబడిన తన భార్యను చూసి షాక్‌ అయ్యానని చెప్పారు. రక్తంతో రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తను లేని జీవితం ఎందుకని తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించానని సురేంద్ర గద్గద స్వరంతో చెప్పారు. పిల్లలను ఇంజనీర్లను చేయలని తన భార్య అందని, ఆ మాటే సూసైడ్‌ నోట్‌లో రాసిందని చెప్పుకొచ్చాడు. తాను కూడా అదే విధంగా రాసానని అన్నాడు. ఇద్దరు పిల్లలు అనాథలవుతారు కదా మీరిద్దరూ లేకపోతే అని ప్రశ్నించగా ఆ ఆలోచన రాలేదని, తన భార్య మరణంతో విరక్తి వచ్చిందని చెప్పాడు. కేసును ఏలూరు రూరల్‌ పోలీసులు నమోదు చేశారు. దర్యాప్తు అన్ని కోణాల నుండి చేస్తామని పోలీసులు తెలిపారు.

Next Story