మృతుల కుటుంబాలకు ఆదుకుంటాం.. పేలుడు ఘటనపై ప్రభుత్వం స్పందన

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.

మృతుల కుటుంబాలకు ఆదుకుంటాం.. పేలుడు ఘటనపై ప్రభుత్వం స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 18 మంది మృతి కార్మికులు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అలాగే ఈ ప్రమాదంలో అనేమంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు సమయంలో మొత్తం 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ స్పందించారు. అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పదుల సంఖ్యలో మృతిచెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు.. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. పేలుడు శబ్ధం విని స్థానికులు భారీగా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిలో మృతుల బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

Next Story