Government:రైతులకు గుడ్ న్యూస్.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-10 10:01:38  IST  )

రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Government:రైతులకు గుడ్ న్యూస్.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్దే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో గత నెల(ఏప్రిల్)లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన విషయం తెలిసిందే. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం పండించిన పంట నీటిలో తడిసిపోయింది. దీంతో చేతికి అందివచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు(Farmers) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఏప్రిల్‌లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రూ. 5.37 కోట్లు విడుదల చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు. ఏప్రిల్ 03 నుంచి 22 వరకు భారీ వర్షాలు రాష్ట్రంలో బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో ఉద్యానశాఖ నివేదికతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ డబ్బు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఏపీలో ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

Next Story