ఆ ముగ్గురినీ తొలగించండి: ప్రభుత్వం కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

ఏపీ కబడ్డీ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్, సెక్రటరీ వీర్లంకయ్యను వెంటనే తొలగించాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది..

ఆ ముగ్గురినీ తొలగించండి: ప్రభుత్వం కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కబడ్డీ అసోసియేషన్‌(AP Kabaddi Association) మాజీ అధ్యక్షుడు ప్రభాకర్, సెక్రటరీ వీర్లంకయ్యను వెంటనే తొలగించాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వీర్లంకయ్యపై ఆరోపణలు ఉన్న నేపనథ్యంలో ఆయన్ను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే నిధులు దుర్వినియోగం చేసినట్లుగా కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ని డబ్బులు అయితే దుర్వినియోగం చేశారనే ఆ మొత్తాన్ని వడ్డీ సహా వసూలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు మరో వ్యక్తిని కూడా తొలగించాలని ఆదేశించింది. విశాఖ(Visakha)కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఏపీ కబడ్డీ అసోసియేషన్‌కు సూచించింది. క్రీడాకారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది.

Next Story