- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ అక్రమాలపై సీరియస్.. ఏజెన్సీలకు ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్-అమెరికా, ఇజ్రాయిల్ మధ్య వార్ కొనసాగుతున్న నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఇదే అదునుగా కొందరు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్-అమెరికా, ఇజ్రాయిల్(Iran- America, Israyel) మధ్య వార్(War) కొనసాగుతున్న నేపథ్యంలో గ్యాస్(Gas) కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఇదే అదునుగా కొందరు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీని వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం గ్యాస్ అక్రమాలపై సీరియస్ అయింది. ఏజెన్సీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఎల్పీజీ సరఫరాపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరా(LPG Supply)పై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అమరావతి(Amaravati)లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్పీజీ కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయంపై అన్వేషణ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇండక్షన్ స్టవ్‌లు, పీఎన్‌జీ, ఈవీ, ఇతర మార్గాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అలర్ట్ కావాలన్నారు. పెట్రోల్, డీజిల్, ఎరువులకు లోటు రాకుండా కేంద్రంతో మాట్లాడాలని చెప్పారు. ఎల్పీజీ సరఫరాలో విద్యాసంస్థలు, ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
గ్యాస్ కొరతపై..
ఇక ఈ సమీక్షలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్యాస్ కొరతపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. కొందరు కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. అక్రమాలకు పాల్పడే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవాలని మంత్రి నాదెండ్ల కోరారు.






