- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క మెసేజ్.. 161 సేవలకు పరిష్కారం.. రెండో విడతపై లీక్ ఇచ్చిన లోకేశ్
ఏపీలో వినూత్న సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో వినూత్న సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పౌర సేవలను త్వరగా పరిష్కరించే విధానాన్ని తొలిసారి అమల్లోకి తీసుకొచ్చింది. మన మిత్ర- ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. వాట్సప్ గవర్నెన్స్(WhatsApp Governance) ద్వారా 161 పౌర సేవలను పరిష్కరించే కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేశ్(Minsiter Nara lokesh) తాజాగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ పాదయాత్రలో తాను హామీ ఇచ్చానని, కొంత సమయం తీసుకున్నప్పటికీ అమలు చేశామని తెలిపారు. పౌర సేవలను మరింత సులభతరం చేయాలని ఛాలెంజ్‌గా తీసుకున్నానని, పాదయాత్రలో హామీ ఇచ్చానని చెప్పారు. మొత్తం 36 ప్రభుత్వ డిపార్ట్ మెంట్లను వాట్సప్ గవర్నెన్స్‌లోకి తీసుకొచ్చామని వెల్లడించారు. మొదట విడతగా 161 సేవలకు శ్రీకారం చుట్టామని, రెండో విడుతలో 360 సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఇది మంచి ప్లాట్ ఫామ్ అని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి రియల్ టైమ్ గవర్నెన్స్ సర్టిఫికెట్ అందిస్తామన్నారు. సర్టిఫికెట్‌పై క్యూ ఆర్ కోడ్ ఉంటుందని తెలిపారు. ఈ క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ప్రభుత్వ వెబ్ సైట్‌కు మెసేజ్ అందుతుందన్నారు. ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసే అవకాశం ఉండదని లోకేశ్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 161 సమస్యలకు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పరిష్కారం పొందవచ్చని మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రభుత్వం అందించే సేవల్లో ఎవరి ప్రమేయం ఉండదని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్ టికెట్(RTC Bus Ticket) నుంచి పిల్లల బర్త్ సర్టిఫికెట్ల వరకూ ఈ విధానంలో త్వరగా తీసుకోవచ్చాన్నారు. దేవదాయ, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య కార్డులు, మున్సిపల్ సేవల కోసం వాట్సప్ నంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. సింగిల్ విండోలో అన్ని రకాల సేవలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, ఈ సేవలకు గాను గత అక్టోబర్‌లో మెటాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని లోకేశ్ స్పష్టం చేశారు.






