- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేద పండితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
వేద పండితులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : వేద పండితులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 590 మంది వేద పండితులకు వేలకు రూ.3 వేల భృతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి(Minister Anam Ramnaranaya Reddy) ఓ ప్రకటన విడుదల చేసారు. కాగా నేడు టీటీడీ(TTD), రాష్ట్ర దేవాదాయశాఖ కలిసి నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ఆనం పేర్కొన్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, తదితర అధికారులతో మంత్రి ఐ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో నెలకొన్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్టు పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులపై సరైన నిర్ణయం తీసుకుంటామని టీటీడీ బోర్డు తెలిపిందన్నారు. విజయవాడ దుర్గ గుడికి మరో రోడ్డు నిర్మించేందుకు టీటీడీ సహకారం అవసరం అన్నారు. టీటీడీ అన్యమతస్థులు ఉన్నారనేది వాస్తవం అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పినట్టు టీటీడీలో 1000 మంది వరకు అన్యమతస్థులు ఉన్నారనే వ్యవహారంపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. టీటీడీ పరిధిలోని పాఠశాలల్లో పోస్టుల భర్తీకి చర్చలు జరుగుతున్నాయని మంత్రి ఆనం వెల్లడించారు.






