- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం(AP Govt) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం(AP Govt) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. 2025 మెగా డీఎస్సీ(2025 Mega DSc)కి వయో పరిమితి(Age Limit) పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. గరిష్ట వయోపరిమితి 42 ఏళ్ల నుంచి 44 ఏళ్ళకు పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది. కాగా దీనికి కటాఫ్ తేదీ 2024 జూలై 1 గా నిర్ణయించింది. అయితే ఈ వయోపరిమితి ఒక్క డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దాదాపు 16 వేలకు పైగా పోస్టులతో ఏపీ పాఠశాల విద్యాశాఖ మరో వారం రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించబోతోంది.
అయితే అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ప్రభుత్వానికి భారీగా వినతులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ప్రక్రియలు అన్నీ మే నెల చివరకి పూర్తి చేసి.. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఎన్నికైన అభ్యర్థులు విధుల్లో చేరేలా ప్రణాళిక రచిస్తోంది ప్రభుత్వం.






