కౌలు రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

కౌలు రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పంటలు సాగు చేసుకునేందుకు కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని సహకార బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. కౌలు రైతుల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని, అర్హులైన వారికి రుణ సౌకర్యం కల్పించాలని తెలిపింది. అయితే కౌలు రైతులు PACS సభ్యత్వం, ఆ పరిధిలో నివాసం, కౌలుపత్రం కలిగి ఉండాలని నిబంధనలు విధించింది. అలాగే ఎకరాకు తక్కువ కాకుండా కౌలు చేసిన వారికే ఈ రుణ సౌకర్యం వర్తింస్తుందని తెలిపింది.

అలాంటి కౌలు రైతులకు గరిష్టంగా రూ.లక్ష వరకు రుణాలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అంతేకాదు రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలు పొందవచ్చని పేర్కొంది. ఇక ఆయా రుణాలను వడ్డీతో సహా ఏడాదిలోపు చెల్లించాల్సి ఉంటుంది. కాగా డీకేటీ, అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసే వారికి ఈ రుణాలు వర్తించవని ప్రభుత్వం తెలియజేసింది.

Next Story