- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP News : పేద విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : పేద విద్యార్థుల(Poor Students)కు ఏపీ సర్కార్(AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది. 2025-26 అకడమిక్ ఇయర్ లో అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్ళలో పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత సీట్ల(Free Seats) కేటాయింపుపై నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం 1వ తరగతిలో 25% సీట్లు పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు కేటాయిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. 5 ఏళ్లు నిండిన వివరాలతో కూడిన వివరాలను ఈనెల 28 నుంచి మే 15వ తేదీ వరకు ప్రభుత్వానికి అప్లికేషన్స్ సమర్పిస్తే.. వాటిని అధికారులు పరిశీలించి అర్హులైన విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్టు పేర్కొంది. అయితే అప్లికేషన్ తో పాటు తల్లిదండ్రుల ధృవీకరణ పత్రాలైన ఆధార్/ఓటర్/రేషన్/జాబ్ కార్డు/విద్యుత్ బిల్లులో ఏదైనా ఒక దానితోపాటు.. విద్యార్థి బర్త్ సర్టిఫికెట్ అటెస్ట్ చేయాలని తెలిపింది.
Next Story