New Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు సర్కార్ గుడ్ న్యూస్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-06 12:55:02  IST  )

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం(AP News) మరో గుడ్ న్యూస్ తెలిపింది.

New Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం(AP News) మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలో కొత్త రేషన్ కార్డులు(News Ration Cards) అప్లై చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) వెల్లడించారు. ఈనెల 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులతోపాటు.. కుటుంబ సభ్యుల చేరికలు, తొలగింపులు, అడ్రస్ మార్పులు వంటి వాటికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కాగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఇప్పటికే 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. కాగా తెల్ల రేషన్ కార్డులకు అర్హత లేకపోయినా పొందినవారు వాటిని తక్షణమే సరెండర్ చేయాలని సూచించారు. అలా లబ్ది పొందుతున్నవారు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.

Next Story