జర్నలిస్టులకు అక్రిడిటేషన్ మంజూరుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

by Muthe.Rajitha |

కొత్త అక్రిడిటేషన్ రూల్స్ 2025 కు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ మంజూరుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : కొత్త అక్రిడిటేషన్ రూల్స్ 2025 కు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2023లో జారీ చేసిన ఉత్తర్వుల స్థానంలో క్రొత్తగా రూపొందించిన మీడియా అక్రిడిటేషన్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర హెడ్ క్వార్టర్స్, పబ్లిషింగ్ సెంటర్లు, జిల్లాలలోని మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులకు అర్హత మేరకు రాష్ట్ర, జిల్లా అక్రిడిటేషన్ కమిటీలలో స్థానం లభించనుంది. చిన్న వార్తాపత్రికల కేటగిరీకి చెందిన జర్నలిస్టులకు సహేతుక సంఖ్యలో అక్రిడిటేషన్లను మంజూరు చేసే సౌకర్యం కల్పించేందుకు ఎంపానెల్డ్, నాన్-ఎంపానెల్డ్ కేటగిరీలుగా వర్గీకరణ చేశారు.

తమకి అక్రిడిటేషన్ వస్తుందో రాదోనని ఎంతో కాలంగా జర్నలిస్టుల్లో నెలకొన్న అనుమానాలు ఈ క్రొత్త రూల్స్ తో తొలగనున్నాయి. క్రొత్త నిభందనల ప్రకారం అతిత్వరలో అక్రిడిటేషన్ మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, రాష్ట్ర , జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల నియామకం జరగనుంది. సోషల్ మీడియాకి సంబందించి కూడా ఒక పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.

Next Story