పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి.. రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుట్టపర్తి సత్యసాయి బాబా(Sathya Sai Baba) శత జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి.. రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుట్టపర్తి సత్యసాయి బాబా(Sathya Sai Baba) శత జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నవంబర్ 23న అధికారికంగా నిర్వహించాలని శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సత్యసాయి ట్రస్టును సంప్రదించి జరపాలని సాంస్కృతిక శాఖకు ఆదేశాలిచ్చింది. మరోవైపు సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీని సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ ఆహ్వానించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ట్రస్టు ప్రతినిధులు జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యం, నాగానందం, హీరా, సత్యసాయి సేవాసంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్‌ పాండేతో కలిసి ఆయన ఢిల్లీలో ప్రధాని మోడీని శుక్రవారం కలిశారు. నవంబరులో జరిగే శత జయంతి వేడుకల్లో పాల్గొనాలని కోరారు.

Next Story