180 మంది క్రీడాకారులకు గుడ్ న్యూస్... భారీగా నిధుల విడుదల

by srinivas |
180 మంది క్రీడాకారులకు గుడ్ న్యూస్... భారీగా నిధుల విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. వారందరికీ ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. క్రీడాకారుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారికి ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. క్రీడాకారులకు ఇవ్వాల్సిన రూ.11.68 కోట్ల పోత్సాహకాలను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీంతో 220 మంది క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్రీడాకారుల సమస్యలపై దృష్టి పెట్టింది. పెండింగ్ నిధుల విషయాన్ని సీఎం దృష్టికి రవినాయుడు తీసుకెళ్లారు. వెంటనే అంగీకరించిన చంద్రబాబు నిధులు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా 180 మంది క్రీడాకారులకు గురువారం రూ. 7.96 కోట్లు విడుదల చేశారు. దీంతో సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కు మంత్రి రావినాయుడు ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారని రవినాయుడు తెలిపారు. గత ప్రభుత్వం క్రీడల పట్ల నిర్లక్ష్యం చేసిందని, తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరించి మంచి క్రీడాకారులను తయారు చేస్తామని రవినాయుడు పేర్కొన్నారు.

Advertisement
Next Story