పీహెచ్‌సీ వైద్యుల వైఖరిపై ప్రభుత్వం ఆగ్రహం.. కఠిన చర్యలకు రంగం సిద్ధం

by Vemula.Srinu Prasad |

పీహెచ్‌సీ వైద్యుల వైఖరిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది..

పీహెచ్‌సీ వైద్యుల వైఖరిపై ప్రభుత్వం ఆగ్రహం.. కఠిన చర్యలకు రంగం సిద్ధం
X

దిశ, వెబ్ డెస్క్: మెడికల్ పీజీ ఇన్- సర్వీస్ కోటా మరింపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం పీహెచ్‌సీ వైద్యులు(PHC doctors ) రాష్ట్రవ్యాప్తంగా సమ్మె(Samme) చేస్తున్నారు. 20 శాతం ఇన్ సర్వీస్ కోటాను అన్ని క్లినికల్ బ్రాంచ్ కోర్సులకు వర్తింపు చేయాలని ప్రధానంగా వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, డీఎంహెచ్ కార్యాలయాల వద్ద శిబిరాలు ఏర్పాటు చేసి 20 రోజులకు పైగా సమ్మె చేస్తున్నారు. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలను సైతం బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కానీ సఫలం కాలేదు. దీంతో తమ డిమాండ్ల పరిష్కరించే వరకు సమ్మె విరమించమని పీహెచ్‌సీ వైద్యులు తెగేసి చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ ధర్మా చౌక్‌లో ప్రధాన సమ్మె సైతం కొనసాగిస్తున్నారు.

అయితే వైద్యుల మొండి వైఖరిపై ప్రభుత్వం సీరియస్ అయింది. పీహెచ్‌సీల్లో సేవలు ఆడిపోకుండా ఏపీవీవీపీ,ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ వైద్యులను తాత్కాలికంగా నియమించింది. ఇక పీహెచ్‌సీ వైద్యులు చేస్తున్న సమ్మెపై కఠిన చర్యలకు సిద్ధమైంది. సమ్మె సమయంలో విధులకు హాజరుకాని వైద్యుల లిస్టును అందజేయాలని అధికారులను ఆదేశించింది. సమ్మెలో పాల్గొన్న సీఏఎస్ వైద్యుల వివరాలతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాలని సూచించింది. అలాగే వైద్యుల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడకుండా చూడాలని, అవసరమైతే అత్యవసర సేవలు అందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Next Story