- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ఎన్నికలపై సజ్జల కీలక వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
ఏపీ ఎన్నికలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఎన్నికలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మార్చిలో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇప్పట్లో ఎన్నికలు లేవని తేల్చి చెప్పారు. పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తనకు తెలియదని తెలిపారు. ఆర్థికంగా వెనుకబాటు తనాన్ని పోగొట్టడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రపంచం మారుతున్నప్పుడు ప్రతిఒక్కరూ మారాలని సజ్జల సూచించారు. రాష్ట్రంలో, దేశంలో సాంకేతిక పెరగడంతో అటు కుల వృత్తులకు కూడా అవకాశాలు కూడా భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వంతో మంచి జరిగిందని నమ్మితేనే తమకు ఓట్లు వేయాలని సజ్జల పేర్కొన్నారు.
Next Story






