నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరణ

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-27 10:42:11  IST  )

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరణ ఇచ్చారు.

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి బాలకృష్ణ ‘సైకో’ అని ప్రస్తావించడంతో సభలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం నడిచింది. తాజాగా దీనిపై టీడీపీ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘టికెట్ రేట్ల పేరుతో తెలుగు చిత్ర పరిశ్రమను గత వైసీపీ ప్రభుత్వం చిత్ర హింసలకు గురిచేసింది. నటులు, నిర్మాతలకు ఊపిరాడనివ్వలేదు. అలా ప్రవర్తించిన తీరుని బాలకృష్ణ ‘సైకో’ అన్నారే తప్ప వ్యక్తిగతంగా ఎవర్నీ కాదు. దుష్ట పాలనను బహిర్గతం చేయడం తప్పుకాదు.. మౌనంగా ఉండటం పెద్ద నేరం’’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కాగా, ఇప్పటికే శాసనసభలో తన పేరు ప్రస్తావనకు రావడంపై సినీ నటుడు చిరంజీవి కూడా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల ధరల పెంపు కోరుతూ చేసిన ప్రయత్నాల్ని, అప్పుడు జరిగిన పరిణామాల్ని వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Next Story