- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో 'విశాఖ గూగుల్' హవా.. నేషనల్ లెవల్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నం ఐటీ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన గూగుల్ ఏఐ డేటా హబ్ శంకుస్థాపన వేడుక ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ కలిసి ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన నేపథ్యంలో, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యంగా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో #GoogleBreaksGroundInVizag అనే హ్యాష్‌ట్యాగ్ టాప్ 5 ట్రెండింగ్‌లో నిలిచింది. వేలాది మంది నెటిజన్లు, ఐటీ నిపుణులు, యువత ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెడుతుండటంతో ఇది నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఏపీ ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను, విశాఖ భవిష్యత్తును కొనియాడుతూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లతో సోషల్ మీడియా వేదికలు హోరెత్తుతున్నాయి. గూగుల్ వంటి గ్లోబల్ జెయింట్ విశాఖకు రావడం ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తం చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






