సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషితోనే విశాఖకు గూగుల్

by Bhoopathi Nagaiah |

సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి లోకేశ్ కృషితోనే ప్ర‌పంచంలోనే అతి పెద్ద సంస్థ అయిన గూగుల్ కంపెనీ విశాఖకు వచ్చిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా అన్నారు.

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషితోనే విశాఖకు గూగుల్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి లోకేశ్ కృషితోనే ప్ర‌పంచంలోనే అతి పెద్ద సంస్థ అయిన గూగుల్ కంపెనీ విశాఖకు వచ్చిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా అన్నారు. బుధ‌వారం విజయవాడ గురునాన‌క్ కాల‌నీలోని ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో మీడియా సమావేశం నిర్వ‌హించి మాట్లాడారు. విశాఖలో రూ.30 వేల కోట్ల పెట్టుబ‌డితో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయ‌నున్న డేటా సెంట‌ర్ వ‌ల్ల దాదాపు ల‌క్ష‌మంది యువ‌త‌కు ప్ర‌త్య‌క్షంగా, పరోక్షంగా ఉద్యోగావ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయ‌క‌త్వంలో రాష్ట్రం శ‌ర‌వేగంగా అభివృద్ధి దిశ‌గా దూసుకుపోతోంద‌న్నారు. అమెరికాలోనే అతి పెద్ద సంస్థ గూగుల్‌ను రాష్ట్రానికి తీసుకురావ‌టంలో మంత్రి నారా లోకేశ్ కీల‌క పాత్ర పోషించారని కొనియాడారు. చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఉంటే ప్ర‌పంచంలోని పెద్ద కంపెనీల‌న్నీ ఏపీ వైపు చూస్తాయ‌న‌డానికి ఇదొక గొప్ప నిద‌ర్శ‌న‌మ‌న్నారు. బెంగుళూరు, పుణే, చెన్నైకి ప‌రిమిత‌మైన ఐటీ రంగాన్ని ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప‌రిచ‌యం చేసిన నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు అంటూ కొనియాడారు. మంత్రి నారా లోకేశ్ విద్యార్ధుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించ‌టంతో పాటు ఉద్యోగావ‌కాశాలు కూడా రాష్ట్రంలోనే క‌ల్పించేందుకు కృషి చేస్తున్నార‌న్నారు. వైసీపీ అప్పుడూ, ఇప్పుడూ రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు రాకూడ‌ద‌ని కోరుకుంటుందని విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ నేత‌లకు నైతికంగా మాట్లాడే హ‌క్కు లేదన్నారు.

Next Story