- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూగుల్ వల్ల లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు: Nara Lokesh
త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు రానున్నాయని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు (Investments) పెట్టేందుకు అనేక కంపెనీలు రానున్నాయని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ప్రకటించారు. గూగుల్ వంటి ప్రముఖ సంస్థల పెట్టుబడుల వల్ల రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత నవంబర్‌లో గూగుల్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu)ను కలిశారని, అప్పట్లో ప్రభుత్వం వారికి అనువైన స్థలాన్ని కూడా చూపించిందని చెప్పారు. “ఇది కేవలం ఎంవోయూ స్థాయిలోనే కాదు, పూర్తి అమలుకు దారి తీసే ప్రాజెక్ట్‌గా ముందుకు సాగుతోందిని లోకేష్ వెల్లడించారు.
అలాగే “విశాఖపట్టణంలో డేటా సెంటర్లు కాకుండా, కృత్రిమ మేధస్సు (AI) రంగానికి సంబంధించిన కంపెనీలు స్థాపనకు వస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్న పెట్టుబడిదారుల జాబితాలో టాప్ టెన్ ఇన్వెస్టర్స్ వివరాలు ఎప్పుడూ తన బ్యాగులో ఉంటాయని తెలిపారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయిలో ఒక శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
అలాగే హైదరాబాద్ మహానగరంలా విశాఖను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని, పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసి చూపిస్తామని లోకేస్ చెప్పుకొచ్చారు. 2047కు విశాఖలో ఒక ట్రిలియన్.. రాష్ట్రంలో 2.4 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యమని, ఎంవోయూలు లేకుండానే మిట్టల్, టీసీఎస్ సంస్థలు.. వచ్చే నెలలో పనులు ప్రారంభించ బోతున్నాయని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. అలాగే ఎంవోయూలు కుదుర్చుకోవాలన్న మోజు తమకు లేదని, నేరుగా ఎగ్జిక్యూషన్‌కు వెళ్తున్నాని, ప్రిజనరీకి, విజనరీకి చాలా తేడా ఉంటుందని ఆయన గుర్తు చేశారు.
చాలా మందికి విజన్ అంటే ఏంటో తెలియదని, హైదరాబాద్‌కు ఎకో సిస్టమ్ రావడానికి.. సీఎం చంద్రబాబు విజన్ కారణమని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ గుర్తు చేశారు. చంద్రబాబు విజన్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉదాహరణ అని, TCS, కాగ్నిజెంట్‌కు మాత్రమే రూపాయికి ఎకరా ఇచ్చామని, మరో కంపెనీకి ఇచ్చినట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు.






