- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో మెగా డేటా సెంటర్ కోసం గూగుల్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం
దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక ఘట్టం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణంలో మెగా డేటా సెంటర్ కోసం గూగుల్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేశాయి.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక ఘట్టం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్టణంలో గూగుల్ మెగా డేటా సెంటర్ (Google Mega Data Center) కోసం గూగుల్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేశాయి. కాగా ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి లోకేష్, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఇతర మంత్రులు, ఎంపీలు, కీలక అధికారులు పాల్గొన్నారు. తాజా ఒప్పందం మేరకు గూగుల్ వచ్చే పదేళ్లలో ఏపీలో రూ. 80,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది.
గూగుల్ తో ఒప్పందం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. “ఇది మనందరికీ చాలా శుభప్రదమైన, సంతోషకరమైన రోజు. ముందుగా ప్రధాన మంత్రికి ధన్యవాదాలు తెలపాలని, ప్రధాని మోడీ (Prime Minister Modi)నే దీనిని సాధ్యం చేశారు. గూగుల్ సృజనాత్మకత, వేగం చాలా ముఖ్యమైనవి. నేను మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చాను. ఈ రోజు గూగుల్ ను విశాఖకు తీసుకురావడం సంతోషంగా ఉంది. దీంతో అనేక మంది పారిశ్రామిక వేత్తలు విశాఖ వైపు ఆసక్తిగా చూస్తున్నారని స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More: ఏపీ సర్కార్‌తో నేడు ‘గూగుల్’ కీలక ఒప్పందం.. ఏకంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు






