Breaking: ఏపీలో పట్టాలు తప్పిన రైలు

by Ajay Maddhiboyina |

ఏపీలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తిరుపతి జిల్లాలోని బాలాయపల్లి మండలం జయంపు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

Breaking: ఏపీలో పట్టాలు తప్పిన రైలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తిరుపతి జిల్లాలోని బాలాయపల్లి మండలం జయంపు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గూడూరువైపు వెళుతున్న రైలుకు గేదెలు అడ్డురావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ప్రమాదంలో కొన్ని గేదెలు మృతిచెంద‌గా రెండున్న‌ర గంట‌ల పాటూ రైలు అక్క‌డే నిలిచిపోయింది. వెంట‌నే రైల్వే సిబ్బందికి స‌మాచారం ఇవ్వ‌డంతో ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని రిపేర్ చేశారు. అనంత‌రం రైలు అక్క‌డ నుండి క‌దిలింది.

Next Story