పట్టాలు తప్పిన గూడ్స్.. అడ్డంగా పడిపోయిన పాలట్యాంకర్

by Naga Rani Yarlagadda |

నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొమ్మాలపూడి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పట్టాలు తప్పిన గూడ్స్.. అడ్డంగా పడిపోయిన పాలట్యాంకర్
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వెంకటాచలం - మనుబోలు రైల్వే స్టేషన్ల మధ్య కొమ్మాలపూడి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఈ గూడ్స్ రైలులోని ఒక పాల ట్యాంకర్ వ్యాగన్ అకస్మాత్తుగా పట్టాలు తప్పి బోల్తా పడింది. పాల ట్యాంకర్ ట్రాక్‌పై అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది. ప్రధాన రైల్వే లైన్‌పై ట్యాంకర్ పడిపోవడంతో విజయవాడ - తిరుపతి మార్గంలో ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. ముఖ్యంగా చెన్నై, తిరుపతి వైపు వెళ్లే రైళ్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సహాయంతో ట్రాక్‌పై పడిపోయిన ట్యాంకర్‌ను తొలగించేందుకు రైల్వే ఇంజనీరింగ్ విభాగం కృషి చేస్తోంది. ట్రాక్ దెబ్బతినడంతో మరమ్మతులు పూర్తి చేసి, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడానికి కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Next Story