- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉచితంగానే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఆరోగ్య

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇస్తూ... కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని నిరుపేదలకు.. పోషక విలువలతో కూడిన కందిపప్పు అలాగే తృణధాన్యాలను ఏపీ సర్కార్ ఇవ్వనుంది. ఈ మేరకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే జూన్ ఒకటో తేదీ నుంచి అన్ని రేషన్ షాపులలో... పంపిణీ చేయబోతోంది.
రేషన్ దుకాణంలో సరుకులతో పాటు సబ్సిడీపై కేజీ కందిపప్పు అలాగే ఉచితంగా రాగులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది కూటమి సర్కారు. దీని కోసం మూడు నెలలకు సరిపడా కందిపప్పు అలాగే ఏడాదికి సరిపడా రాగుల సేకరణకు టెండర్లను కూడా ఆహ్వానించింది. ఈ ప్రక్రియ... నెలరోజుల్లోపు పూర్తయి... జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపులలో... కందిపప్పు అలాగే రాగులు ఇచ్చేలా ఏర్పాటు చేయబోతున్నారు.
ఇక అటు... ఏపీలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వం కంటే... మెరుగ్గా పని చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అదే సమయంలో కేంద్ర సహాయం తీసుకొని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తోంది కూటమి సర్కార్. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం అడుగులు వేస్తోంది.






