ఇంద్రకీలాద్రి దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్

by Ajay Maddhiboyina |

ఇంద్ర‌కీలాద్రి దుర్గ‌మ్మను ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఫ్రీ ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తులు సైతం గ‌ర్భ‌గుడి ద‌ర్శ‌నం చేసుకునే అవకాశం క‌ల్పించేలా అధికారులు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించారు. ఖాళీ స‌మ‌యంలో గంట‌పాటు ఉచిత ద‌ర్శ‌నం నుండి గర్భ‌గుడి ద‌ర్శ‌నం క‌ల్పించారు.

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: ఇంద్ర‌కీలాద్రి దుర్గ‌మ్మను ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఫ్రీ ద‌ర్శ‌నానికి వెళ్లే భ‌క్తులు సైతం గ‌ర్భ‌గుడి ద‌ర్శ‌నం చేసుకునే అవకాశం క‌ల్పించేలా అధికారులు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించారు. ఖాళీ స‌మ‌యంలో గంట‌పాటు ఉచిత ద‌ర్శ‌నం నుండి గర్భ‌గుడి ద‌ర్శ‌నం క‌ల్పించారు. ఈ స‌మ‌యంలో దాదాపు 1500 మంది భ‌క్తులు అమ్మవారిని నేరుగా ద‌ర్శించుకున్నారు. భ‌క్తుల అభిప్రాయాల‌ను సేక‌రించిన త‌ర‌వాత ఉచిత‌ గ‌ర్భ‌గుడి ద‌ర్శ‌నంపై నిర్ణ‌యం త‌సుకుంటామ‌ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉంటే ఇంద్ర‌కీలాద్రి దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తుంటారు. ఏపీ, తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల నుండి సైతం పెద్ద ఎత్తున భ‌క్తులు వ‌చ్చి ద‌ర్శించుకుంటారు. అయితే గ‌ర్భ‌గుడి ద‌ర్శ‌నం కేవ‌లం స్పెష‌ల్ ద‌ర్శ‌నం టికెట్ తీసుకున్న‌వారికే అందుబాటులో ఉండ‌టం ద్వారా పేద‌వాళ్లు, డ‌బ్బు చెల్లించ‌లేని భ‌క్తులు నిరాశచెందుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల‌ అలాంటి భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story