రాష్ట్ర రైతుల‌కు శుభ‌వార్త‌..ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి రూ.6,000

by velandi.Saikiran |

పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు కృష్ఠా జిల్లా గన్నవరంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు జమ చేస్తారు.

రాష్ట్ర రైతుల‌కు శుభ‌వార్త‌..ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి రూ.6,000
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఎల్లుండి నుంచి ఏపీ రైతుల ఖాతాలలో రూ. 6000 జమ కానున్నాయి. పీఎం కిసాన్ పథకంతో ( pm kisan yojana) కలిపి అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava) నిధులు విడుదల చేయనుంది ఏపీ కూటమి సర్కార్. కృష్ఠా జిల్లా గన్నవరంలో ఈ నెల 13వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిధులను జమ చేస్తారు.

ఆ రోజున 46.80 లక్షల మంది రైతులకు ఖాతాలలో రూ. 2808 కోట్లు జమ చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీఎం కిసాన్ కింద రూ. 2000 కేంద్రం ఇస్తుండగా, అన్నదాత సుఖీభవ కింద రూ. 4000 కూటమి సర్కార్ అందించనుంది. ఇలా మొత్తంగా ఏపీ రైతన్నకు రూ. 6000 ఎల్లుండి డిపాజిట్ అవుతాయి. ఇప్పటికే రెండు విడ‌త‌ల్లో రూ. 6309 కోట్లు రైతుల కుటుంబాలకు పంపిణీ చేసింది కూటమి సర్కార్.

ఇప్పుడు మరో రూ. 2808 కోట్లు పంపిణీ చేయనుంది. ఇక ఈ నిధులు విడుదలవుతున్న నేపథ్యంలో ఏపీ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎల్లుండిపీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయనుంది మోడీ సర్కార్. ఇప్పటి వరకు 21 విడతల్లో డబ్బులు పంపిణీ చేసిన మోడీ సర్కార్, ఎల్లుండి 22వ విడత పంపిణీ చేయనుంది.

Next Story