- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GOOD NEWS: మహా కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. పూర్తి వివరాలివే
ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) జరుగుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ఆర్టీసీ (APSRTC) భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ యాత్రలో ప్రయాగరాజ్‌తో పాటు అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొనే విధంగా మొత్తం 8 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొంది.
యాత్ర వివరాలు..
ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం విజయవాడ PNBS నుంచి బస్సులు బయలుదేరుతాయి. 2న సాయంత్రం ప్రయాగరాజ్ చేరుకుంటాయి. 3న ప్రయాగ్ రాజ్‌లో బస ఉంటుంది. 4న రాత్రి ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్యకు బయలుదేరుతాయి. 5న ఉదయం అయోధ్య చేరుకుని బాల రాముడి దర్శనాంతరం రాత్రికి వారణాసికి పయనమవుతాయి. 6న వారణాసి చేరుకొని అక్కడే రాత్రికి బస ఉంటుంది. 7వ తేదీ ఉదయం వారణాసి నుంచి విజయవాడుకు బయలుదేరి 8న చేరుకుంటాయి.
ఈ యాత్రలో పిల్లలు, పెద్దలకు ఒకటే ఛార్జీ ఉంటుంది. అది కూడా కేవలం బస్సు ఛార్జీల వివరాలు మాత్రమేనని, భోజనం, వసతి ఖర్చులు వారే పెట్టుకోవాలి. యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు 29 నుంచి 35 మంది సమూహంగా వస్తే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది. ముందస్తు రిజర్వేషన్ కోసం ఆన్‌లైన్, సమీప బస్ స్టేషన్, ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద టికెట్లు పొందవచ్చు. మరిన్ని వివరాలకు 80742 98487, 0866 2523926, 0866 2523928 నంబర్లలో సంప్రదించాలి. కాగా, ఇప్పటికే కొవ్వూరు, రాజమహేంద్రవరం డిపోల నుంచి బస్సులు ఏర్పాటు చేశామని, వాటిల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయని, ఇవి కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుంచే బయలుదేరుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఛార్జీల వివరాలు..
సూపర్ లగ్జరీ - రూ.8,000
స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ - రూ.11,000
వెన్నెల ఏసీ స్లీపర్ - రూ.14,500






