తీపి కబురు.. విద్యుత్ ​చార్జీలు మరింత తగ్గుతాయన్న మంత్రి

by Thanuru Gopichand |

రానున్న రోజుల్లో మరింతగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు

తీపి కబురు.. విద్యుత్ ​చార్జీలు మరింత తగ్గుతాయన్న మంత్రి
X

దిశ డైనమిక్ బ్యూరో : రానున్న రోజుల్లో మరింతగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈరోజు మంత్రి గొట్టిపాటి నేతృత్వంలోని అధికారుల బృందం ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనుంది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలకనుంది. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారి విద్యుత్ ఛార్జీలు ట్రూడౌన్ చేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. సంస్కరణలకు నాంది పలికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్ ప్రక్రియ అందిస్తున్నామని తెలిపారు. అనైతిక విధానాలతో ప్రజలపై జగన్ రూ.18 వేల కోట్ల భారం మోపారని ఆరోపించారు. జగన్ పాపాలను భరిస్తూనే ఛార్జీలు తగ్గించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం అన్నారు. జగన్ పీపీఏ రద్దు చేయడం వల్ల ఉత్పత్తైన విద్యుత్ ను వాడుకోలేకపోయాం అని తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం అన్నారు. ఏటా పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి తగ్గట్లుగా ఉత్పత్తిపైనా దృష్టి సారిస్తున్నాం అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు

Next Story