Good News: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రాత పరీక్షపై జైళ్ల శాఖ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ నిరుద్యోగ సమస్యపై నడుంబిగించింది.

Good News: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రాత పరీక్షపై జైళ్ల శాఖ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ నిరుద్యోగ సమస్యపై నడుంబిగించింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ (Andhra Pradesh State Prisons Department) లో డ్రైవర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహించాలని ఆ శాఖ భావిస్తోంది. కాగా, గతంలో నిర్వహించిన డ్రైవింగ్ పరీక్షలో మొత్తం 311 మంది ఉత్తీర్ణత సాధించగా.. వారందరికీ మార్చి 2న వాత పరీక్ష నిర్వహించబోతున్నారు. ఏకంగా 311 మంది నెల్లూరు (Nellore) జిల్లా మూలపేట (Mulapet)లోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్మేషన్ సర్వీసెస్ (AP State Training Academy Formation Services) పాత సెంట్రల్ జైలు ఆవరణలో అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. MLV అభ్యర్థులు ఉదయం 8 గంటలకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. HMV అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటలకు పరీక్షకు హాజరుకావాలి. ఈ మేరకు జైళ్ల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story