Good News: మందుబాబులకు భారీ గుడ్ న్యూస్.. ఆ మూడు బ్రాండ్ల ధరలు తగ్గింపు

by Kema Shiva Kumar |   (  Updated:2024-11-30 07:40:44  IST  )

మందుబాబులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Good News: మందుబాబులకు భారీ గుడ్ న్యూస్.. ఆ మూడు బ్రాండ్ల ధరలు తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: మందుబాబులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే చీప్ లిక్కర్‌ (Cheap Liquor)ను రూ.99కే అందిస్తున్న సర్కార్ మరో మూడు బ్రాండ్ల రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తగ్గిన బ్రాండ్లలో రాయల్ ఛాలెంజ్ గోల్డ్ (Royal Challenge Gold) క్వార్టర్ ధర ప్రస్తుతం రూ.230 ఉండగా రూ.210కి తగ్గంది. ఫుల్ బాటిల్ రూ.920 ఉండగా.. రూ.840కి తగ్గింది. మాన్షన్ హౌస్ (Mansion House) క్వార్టర్ ధర రూ.220 ఉండగా రూ.190కి తగ్గంది. ఇక ఫుల్ బాటిల్ ధర రూ.870 ఉండగా రూ.760కి తగ్గింది. అదేవిధంగా యాంటిక్విటీ (Antiquity) ఫుల్ బాటిల్ రూ.1,600 ఉండగా.. రూ.1,400లకు తగ్గింది. త్వరలోనే మరో రెండు బ్రాండ్ల ధరలు కూడా తగ్గిస్తారని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story