Government:ఆ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

by Jakkula.Mamatha |

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా దూసుకెళ్తుంది.

Government:ఆ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం  గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు)CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ(Medical Health Department)లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త చెప్పింది. వారికి అదనంగా 5 క్యాజువల్ సెలవులు మంజూరు చేసింది. తమకు క్యాజువల్ లీవ్స్ తక్కువగా ఉన్నాయని, పెంచాలని ఆయా ఉద్యోగులు చేసిన విజ్ఞప్తితో ప్రభుత్వం ఈ సెలవులు మంజూరు చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయనుంది.

ఈ నిర్ణయం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు పరిమిత క్యాజువల్ సెలవులు(CL) మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ క్రమంలో క్యాజువల్ లీవ్స్(Casual leaves) తక్కువగా ఉండటంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అవి పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల సదరు ఉద్యోగులకు మరింత పని మూడ్ పెరగడమే కాకుండా, పనితీరు మెరుగు పడే అవకాశం ఉంది.

Next Story