- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ.. టికెట్ ఇదే!?
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ(Andhra Pradesh)లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఉచిత ప్రయాణం పై విధివిధానాలను ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే నెల(ఆగస్టు) 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో దీనిపై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఆర్టీసీ(APSRTC)లో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు వీలుగా ముద్రించిన నమూనా టికెట్ సోషల్ మీడియా(Social Media)లో హల్ చల్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, డిపో పేరు, స్త్రీ శక్తి ప్రయాణించే ప్రదేశం, చేరాల్సిన గమ్యస్థానం వంటి అంశాలను దానిపై ముద్రించారు. మొత్తం టికెట్ ధర, ప్రభుత్వ రాయితీ చెల్లించాల్సినది రూ.0.00గా ముద్రించారు.
అయితే.. తెలంగాణ(Telangana), కర్ణాటక(Karnataka)లో ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఆధార్, ఓటరు లేదా పాన్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చాని సమాచారం.






