- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఏపీలో వాలంటీర్లకు గుడ్ న్యూస్.. ఇక వారికి పండుగే
దిశ, వెబ్‌డెస్క్ : వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలిని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సర్కార్ వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వాలంటీర్లుగా ఉత్తమ సేవలందించిన వారికి ప్రోత్సాహకంగా వాలంటీర్ల అభినందన కార్యక్రమం-2024 పేరిట నగదు బహుతులు అందజేయనుంది. ఈ మేరకు వారిని ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి మండల, పట్టణ, జోనల్, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వారి సన్మానించి నగదు బహుమతులు ఇవ్వనున్నారు. వాలంటీర్లకు ప్రభుత్వం ఏటా సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో పాటు నగదు పురస్కారాలను అందజేయనుంది. ఫిబ్రవరి నెల మూడో వారంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో వీరిని సత్కరించనున్నారు. మండల, పట్టణ, జోనల్ స్థాయిలో ఎంపికైన వారికి రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు.