Cognizant:యోగ డే వేళ విశాఖ వాసులకు శుభవార్త.. 8 వేల మందికి ఉద్యోగాలు?

by Jakkula.Mamatha |

విశాఖపట్నంలో రూ.1,582 కోట్ల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ ముందుకు వచ్చింది

Cognizant:యోగ డే వేళ విశాఖ వాసులకు శుభవార్త.. 8 వేల మందికి ఉద్యోగాలు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖపట్నంలో రూ.1,582 కోట్ల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ ముందుకు వచ్చింది. విశాఖ వేదికగా యోగాంధ్ర నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఆ సమయంలోనే కాగ్నిజెంట్ విశాఖపట్నంలో తమ సంస్థ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్ కు సమాచారాన్ని పంపడం ఓ కీలక మైలురాయి గా చెబుతున్నారు. విశాఖను ఐటీ రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా వీలైనంతవరకు పెట్టుబడులను ఆహ్వానించి తద్వారా ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా కాగ్నిజెంట్ సొల్యూషన్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా దశలవారీగా దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. గతంలో టిసిఎస్ కు ఏ విధంగా అయితే ఎకరా భూమి 99 పైసలకే కేటాయించారో.. అదేవిధంగా కాగ్నిజెంట్ కు కూడా 99 పైసలకే ఎకరా కేటాయించనుంది. కాపులపాడు వద్ద 21.31 ఎకరాలను కేటాయించాలని ఆ సంస్థ కోరింది కోరింది. 2029 మార్చి నాటికి ప్రారంభించాలని కాగ్నిజెంట్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Next Story