- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home Minister Anitha:గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు(బుధవారం) హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శులకు హోం మంత్రి అనిత గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న వారిలో కొందరు పోలీస్ శాఖలో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మరికొందరు ఆసక్తిగా లేరని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత.. వారిని ఎలా వినియోగించాలనే దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని తెలిపారు. ఈ విషయం పై 10-15 రోజుల్లో వారి అర్హతకు తగ్గ హోదాల్లో ఉంచుతాం అని హోం మంత్రి అనిత వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వం పై హోంమంత్రి అనిత నిప్పులు చెరిగారు. నిన్న మాజీ సీఎం జగన్(Former CM Jagan) టూర్ ఓ డ్రామాని తలపించిందని విమర్శించారు. నిన్న పర్యటనలో వైఎస్ జగన్ మాట్లాడుతుంటే వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలన గుర్తుకు వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన జనాలు మర్చిపోలేదని గుర్తు చేశారు. పోలీసుల పై దారుణంగా మాట్లాడుతున్నారని హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. Cmr నుంచి కొని తెచ్చుకోవడంతో వచ్చింది కాదు ఖాకీ చొక్కా.. అటువంటి ఖాకీ చొక్కా ఊడదీస్తానని మాజీ సీఎం జగన్ అనొచ్చా? అని ఆమె మండిపడ్డారు.






