- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 251 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్ మేనేజర్, 201 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ఈ నెల(జనవరి) 22లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆప్కాబ్ వైబ్‌సైట్‌లో తెలిపింది. అప్లికేషన్ ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.700 మిగతా వారికి రూ.500 ఫిబ్రవరిలో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించనున్నారు. వీటిలో కొన్ని ఇన్ సర్వీస్ పోస్టులు ఉన్నాయి.
అంతేకాదు ఏపీ అవుట్ సోర్సింగ్(AP Outsourcing) & కాంట్రాక్ట్ విభాగం నుంచి 142 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కృష్ణా జిల్లాలోని హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సహాయకుడు, అటెండర్, టెక్నీషియన్ వంటి పోస్టుల కోసం 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.






