- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD: తిరుమల భక్తులకు శుభవార్త.. మరో కీలక నిర్ణయానికి టీటీడీ రెడీ!
ఏపీ(Andhra Pradesh)లోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ తరుణంలో తిరుమల భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో టీటీడీ శ్రీవారి భక్తుల కోసం మరికొన్ని రోజుల్లో మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో బీమా(insurance) సదుపాయం కల్పించాలని టీటీడీ ఉన్నతాధికారి పరిశీలిస్తున్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం రోజూ సుమారు 70 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు.
ఈ క్రమంలో భక్తులు(Devotees) తిరుమల(Tirumala) ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం, క్యూలైన్లు తదితర ప్రదేశాల్లో ప్రమాదాలకు గురి కావడం, నడక మార్గంలో అడవి జంతువుల దాడి లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు బీమా కల్పించాలని చేయాత అందించాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం. తిరుమలలో ప్రమాదం బారిన పడి మృతి చెందిన వారికి TTD రూ.3 లక్షల వరకు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు అలిపిరి నుంచి తిరుమలకు(Alipiri-Tirumala).. తిరుమల నుంచి అలిపిరి(Tirumala-Alipiri) వరకు భక్తులు చేరుకునే వరకు బీమాను కల్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.






