TTD News:తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త.. టీటీడీ ఈవో కీలక ప్రకటన

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-06 09:54:43  IST  )

తిరుమల శ్రీవేంకటశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ఈవో శ్యామలరావు గుడ్ న్యూస్ చెప్పారు.

TTD News:తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త.. టీటీడీ ఈవో కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ఈవో శ్యామలరావు గుడ్ న్యూస్ చెప్పారు. శ్రీవారి దర్శనార్ధం కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఈవో జె. శ్యామలరావు ప్రకటించారు. ఇటీవల కాలినడకన వెళ్లే మార్గంలో టోకెన్లు పొందేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రచారం జరగడంతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం లతో కలిసి ఆయన ఈ రోజు(మంగళవారం) తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్లు పొందడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఆటోవాలాల నుంచి సరైన సహకారం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఈ క్రమంలో టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను ఆటోవాలాలు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు, భక్తుల నుంచి విచ్చలవిడిగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు శాశ్వత పరిష్కార మార్గం దిశగా చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించుకుని, మరింత మెరుగైన పటిష్టమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు బస్సుల సంఖ్య పెంపు పై మరియు టోకన్ల జారీ కౌంటర్లను పెంచే అంశాలను పరిశీలిస్తామన్నారు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించి పటిష్ట సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

Next Story