తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. నేరుగా శ్రీవారి దర్శనం

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-24 03:11:09  IST  )

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. నేరుగా శ్రీవారి దర్శనం
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా లేదా అధికంగానూ ఉంటుంది. అ తరుణంలో ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నిన్న(శనివారం) శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడితే.. నేడు(ఆదివారం) శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. నిన్న శ్రీవారిని 83,858 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.93 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

Next Story