- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు శుభవార్త.. 15 సెకన్లలోనే శ్రీవాణి టికెట్ల జారీ !
శ్రీవాణి దర్శన టికెట్ల (Srivani Tickets) జారీ విధానంలో త్వరలోనే పూర్తిస్థాయిలో మార్పులు తెచ్చేందుకు టీటీడీ (TTD) చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీవాణి దర్శన టికెట్ల (Srivani Tickets) జారీ విధానంలో త్వరలోనే పూర్తిస్థాయిలో మార్పులు తెచ్చేందుకు టీటీడీ (TTD) చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం వచ్చే కుటుంబంలోని ఓ వ్యక్తి ఫొటో, ఫోన్ నంబరును క్యూ లైన్ లోనే సిబ్బంది క్యాప్చర్ చేసి అతని మొబైల్ కు ఓ లింకును పంపుతారు. ఆ లింకు పొందిన భక్తులు శ్రీవాణి టికెట్ల కోసం తనతోపాటు కుటుంబ సభ్యుల వివరాలను అందులోనే నమోదు చేసి నగదును డిజిటల్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భక్తులు క్యూలైన్లో ఉండగానే భక్తులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం టికెట్లు జారీ చేసే సిబ్బంది భక్తుల ఫొటో తీసుకుని శ్రీవాణి టికెట్లు జారీ చేస్తారు. దీంతో భక్తులు తమ వివరాల నమోదు, నగదు చెల్లింపునకు పట్టే సమయం పూర్తిగా తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవాణి టికెట్ జారీకి ఒకటిన్నర నిమిషం పడుతుండగా.. కొత్త విధానం అమల్లోకి వస్తే 15 సెకన్లలోనే టికెట్లు జారీ అవుతాయి. మరోవైపు, శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులకు 12 గంటల సమయానికే గదులను కేటాయించేందుకు ఉన్న అవకాశాలను టీటీడీ పరిశీలిస్తోంది.






