సంక్రాంతి కోసం ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీచ్ ఫెస్టివల్

సంక్రాంతి కోసం ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ(Sankranti Festival)ను ఏపీ ప్రజలు ఎంత గ్రాండ్‌గా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏ మూలన స్థిరపడిన వారైనా సంక్రాంతి పండక్కి ఊరికి వస్తారు. కోడి పందాలు, ఎద్దుల పోటీలు, గాలిపటాలు ఎగురవేయడం, ముగ్గుల పోటీలు వంటి ఆటలతో ఎక్కడ చూసినా సందడిగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బీచ్ ఫెస్టివల్ కూడా అద్భుతంగా నిర్వహిస్తారు. తాజాగా ఈ బీచ్ ఫెస్టివల్‌కు సంబంధించిన తేదీలు ఖరారు అయ్యాయి. ఈనెల 14వ తేదీ నుంచి మూడు రోజుల ఎస్. యానాంలో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన బ్రోచర్‌ను ఎపీ హరీష్, ఎమ్మెల్యే ఆనందరావులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ బీచ్ ఫెస్టివల్‌కు రోజుకు 2 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. బీచ్‌లో జరిగే సంక్రాంతి సంబురాలను రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి నిర్ణయించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తోపాటు ఇతర కూటమి నేతలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి బీచ్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. పండుగ మూడ్రోజులూ తిరునాళ్లను తలపించే రీతిన ఇక్కడ వాటర్‌ స్పోర్స్‌, పారాచ్యూట్స్‌ వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Next Story